బుధవారం 27 మే 2020
National - May 21, 2020 , 23:30:20

డాక్టర్ల కోసం ఆన్ ‌లైన్ వీడియో క్లీనిక్ పరిష్కారాన్ని ఆవిష్కరించిన నౌఫ్లోట్స్

 డాక్టర్ల కోసం ఆన్ ‌లైన్ వీడియో క్లీనిక్ పరిష్కారాన్ని ఆవిష్కరించిన నౌఫ్లోట్స్


 

హైదరాబాద్: నౌఫ్లోట్స్ అత్యంత సమగ్రమైన ఆన్‌లైన్ వీడియో క్లీనిక్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. ఆన్ లైన్ లో వైద్య సేవలు అందించేందుకు వీలుగా, వైద్యుల కోసం వీడియో క్లినిక్‌లను ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆధీనంలోని నౌఫ్లోట్స్‌ తెలిపింది. డాక్టర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత వెబ్‌సైట్లు రూపొందించి అందిస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర సమయాల్లోనూ వైద్యులను అప్రమత్తం చేసి, సంప్రదించేందుకు వీలుకల్పిస్తున్నది. ఆన్‌లైన్‌లో చికిత్స అందించేందుకు వారికి ఇది తోడ్పడుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు రోనక్‌ కుమార్‌ సామంతరాయ్‌ అన్నారు. ఈ వెబ్‌సైట్ల నిర్వహణకు నెలకు రూ.1,000, ఏడాదికి రూ.10వేలు ఖర్చవుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఆరువేల మంది వైద్యులు దీన్ని వినియోగిస్తున్నారని, ఏడాదికల్లా లక్షమందికి చేరువకావాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్లు పేర్కొన్నారు. వైద్యులను సంప్రదించాలనుకునే వారు ప్రత్యేకంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. నేరుగా బ్రౌజర్‌ నుంచే డాక్టర్లను సంప్రదించవచ్చని చెప్పారు. logo