గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 18:44:00

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్ లో జీ తెలుగు 25 గంటల ఫండ్‌ రైజర్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్ లో జీ తెలుగు 25 గంటల ఫండ్‌ రైజర్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌

 హైదరాబాద్‌: జీ గ్రూప్ టెలివిజన్ సరిగమప 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా  తెలుగులో లీడింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌గా ఉన్నజీ తెలుగు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్ లో  25 గంటల ఫండ్‌ రైజర్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో విజయ్‌ ప్రకాశ్‌, చంద్రబోస్‌, కోటి, మాల్గాడి శుభ, అనుదీప్‌ కులకర్ణి, సత్యయామిని, సాహితి, రేవంత్‌, పర్ణిక, దీప్తి మాధురి, హేమచంద్ర, శ్రీకృష్ణ, సాయి దేవ హర్ష  పాల్గొననున్నారు. " ఏక్‌ దేశ్‌ - ఏక్‌ రాగ్‌ "పేరుతో 25 గంటల నాన్‌స్టాప్‌ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ ను జీ సమర్పిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా సంగీత ప్రియుల తోపాటు , టెలివిజన్‌ ప్రేక్షకుల్ని ఒకే వేదిక పైకి తీసుకువచ్చి కరోనా మహమ్మారిపై పోరాడేందుకు సిద్ధమవుతున్నది. ఈ లైవ్‌ కార్యక్రమం కోవిడ్‌ 19పై పోరాడుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు ఉపయోగపడనున్నది. ఈ కాన్సర్ట్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న గాయనీ, గాయకులు 10 "జీ" ఫేస్‌బుక్ పేజీల ద్వారా దాదాపు 350 లైవ్‌ పర్‌ఫార్మెన్స్‌లు ఇవ్వనున్నారు.


 


logo