బుధవారం 03 జూన్ 2020
National - May 20, 2020 , 23:50:58

కరోనా నియంత్రణలో సిపిసి డయాగ్నస్టిక్స్ వేగవంతమైన సేవలు

కరోనా నియంత్రణలో సిపిసి డయాగ్నస్టిక్స్ వేగవంతమైన సేవలు

 చెన్నై:  కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం లో తన వంతు సహకారాన్ని అందించడానికి చెన్నైకి చెందిన సిపిసి డయాగ్నోస్టిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. అందుకోసం వేగవంతమైన పరీక్షలు నిర్వహించే బాధ్యతను భుజాన వేసుకున్నది. SARS COV-2 IgM , SARS COV-2 IgG కరోనా నిర్ధారణ యాంటీ బాడీ పరీక్షలు చేసేందుకు సిపిసి డయాగ్నోస్టిక్స్ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్ ) నుంచి ఆమోదం  పొందింది. షెన్‌జెన్ ఆధారిత YHLO బయోటెక్ కో. లిమిటెడ్ అభివృద్ధి చేసిన CLIA- ఆధారిత పరీక్షలు పూర్తి ఆటోమేటెడ్ ఎనలైజర్‌లైన ఐఫ్లాష్ 1800/3000 పై నడుస్తాయి, ఇవి వరుసగా 96.3శాతం , 99.2శాతం నిర్దిష్టత కలిగిన IgG , IgM లకు 97.3శాతం ,86.1శాతం సున్నితత్వాన్ని అందిస్తున్నాయి. వ్యాధి సోకిన తర్వాత 7 వ రోజు కంటే ముందుగానే IgM పరీక్ష వ్యాధిని గుర్తించగలదు. పెద్ద వాల్యూమ్ లను నిర్వహించేటప్పుడు ఐఫ్లాష్ వ్యవస్థ మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. ఎనలైజర్ మోడల్‌పై ఆధారపడి, మరిన్ని మాడ్యూల్ లను జోడించే సౌకర్యాల సౌలభ్యంతో అవుట్‌పుట్ ను గణనీయంగా పెంచడానికి, ఒక ప్రయోగశాల రోజుకు 1000 నుంచి  2000 ఫలితాలను ఒకే పరికరంపై అందించగలదు .  చికిత్స కోసం ప్లాస్మా (కోలుకున్న వ్యక్తుల నుంచి)  అనుకూలతను అంచనా వేయడానికి కూడా ఈ ఫలితం ఉపయోగపడుతుంది.  “ మెరుగైన పరీక్షల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది,   నిర్దిష్ట పరీక్షలతో కోవి డ్  -19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి సహకరిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని సిపిసి డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్   కైలాస్ నాథ్ తెలిపారు.  ఈ పరీక్షలను వారికి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య పరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన  పేర్కొన్నారు. 


logo