బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 21:17:32

స్టార్టప్ రంగంపై కరోనా ప్రభావం

  స్టార్టప్ రంగంపై కరోనా ప్రభావం

హైదరాబాద్: కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాల్లోని అన్నిరంగాలు కుదేలయ్యాయి. ఇండియా స్టార్టప్ రంగంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఇండియాలో ప్రతి 10 స్టార్టప్ కంపెనీల్లో 9 సంస్థలు విలవిల్లాడుతున్నాయని ఐటీ ట్రేడ్ బాడీ 'నాస్కామ్' సర్వే తెలిపింది. స్టార్టప్ లపై నాస్కామ్ నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో దాదాపు 30 నుంచి 40 శాతం స్టార్టప్ లు పూర్తిగా లేదా తాత్కాలికంగా మూతపడ్డాయని తేలింది. మిగిలిన 70 శాతం స్టార్టప్ లలో నిధులు మరో మూడు నెలల వరకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉన్నది. 250కి పైగా స్టార్టప్ కంపెనీల పై నాస్కామ్ సర్వే చేసింది. 62 శాతం కంపెనీల రెవెన్యూలో 40 శాతం వరకు తగ్గుదల కనిపించగా. 34 శాతం కంపెనీలు మాత్రం ఆందోళనకర స్థాయిలో 80 శాతం రెవెన్యూని కోల్పోయాయి. దీనికంతా కారణ కేవలం కరోనా మహమ్మారే. ట్రావెల్, ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన స్టార్టప్ లు దారుణంగా నష్టపోయాయి. వీటితో పాటు లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్ మెంట్ తదితర స్టార్టప్ లు కూడా రెవెన్యూలో తగ్గుదలను చవిచూశాయి. అయితే హెల్త్ కేర్, ఫైనాన్స్, విద్యకు సంబంధించిన స్టార్టప్ లు మాత్రం లాభాలను నమోదు చేసే అవకాశం ఉ న్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


logo