శుక్రవారం 05 జూన్ 2020
National - May 19, 2020 , 18:49:21

సెజల్ కుమార్ కు అరుదైన ఘనత

 సెజల్ కుమార్ కు అరుదైన ఘనత

 ఢిల్లీ : సామాజిక సమస్యలపై పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తిదాయకమైన యూట్యూబర్లను ప్రతి ఏటా యూట్యూబ్ ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఆ జాబితాలో భారత దేశం తరఫున సెజల్ కుమార్ యూట్యూబ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్ అంబాసిడర్ గా స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల విద్య ను ప్రోత్సహించే   ప్రాజెక్టులో భాగంగా సెజల్ కుమార్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీతో కలిసి పని చేయనున్నది. యూట్యూబ్ ప్రపంచంలో తనదైన శైలిలో ముద్రవేసింది సెజల్‌ కుమార్‌. ఫ్యాషన్‌ వీడియోలతోపాటు, స్కెచెస్, ట్రావెలాగ్స్, డాన్స్, మ్యూజిక్‌ వీడియోలు  రూపొందిస్తూ యూట్యూబ్ స్టార్ గా మారింది. మిలియన్ల కొద్దీ వీక్షకులను ఆకట్టుకుంటున్నది. యువత ఆసక్తులు, అభిరుచులకు తగిన వీడియోలు రూపొందిస్తూ సంచలనం సృష్టిస్తున్నది. 2014లో యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. మొదట్లో ఆమె ఎన్నో అవమానాలను భరించింది. ఇప్పుడు సెజల్ విజయాన్ని చూసి విమర్శించినా వారే ప్రశంసిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన  డాక్టర్‌ అంజలీ కుమార్, అనిల్‌ కుమార్‌ ఆమె తల్లిదండ్రులు. తల్లి డాక్టర్‌. తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌. సెజల్‌కు ఒక అన్న రోషన్‌. ఇంటర్‌ వరకూ సెజల్‌ చాలా బిడియ పడుతుండేది. ఎంతో దగ్గరి సన్నిహితులతో తప్ప బయటవాళ్లతో పెద్దగా కలిసేది కాదు. శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఢిల్లీ యూనివర్శిటీ)లో డిగ్రీ చేస్తున్నప్పుడు సెజల్‌ ఆలోచన మారింది. మొదటి నుంచీ వీడియోగ్రఫీ అంటే ఇష్టపడేది. తన దగ్గరున్న వీడియోతో తనకు నచ్చినవి తీస్తూ ఉండేది.  టర్కీ వె ళ్లే టప్పుడు తన పరిశీలనలను వీడియోలో బంధించింది. అలాగే టర్కీలో సీజన్‌ ఫ్యాషన్‌ను  కాప్చర్‌ చేసింది.  ఎడిటింగ్‌ చేసి ‘‘సమ్మర్‌ స్టయిల్‌ ఇన్‌ టర్కీ’’ అనే పేరుతో  ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌చేసింది . దీనికి మంచి స్పందన వచ్చింది.  ఆసమయం లోనే సెజల్‌ తన లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నది. టర్కీ నుంచి వచ్చాక యూట్యూబ్‌ చానల్‌నే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్నది . సెజల్‌ తన వీడియోలకు కంటెంట్‌ రాసుకోవడాన్నే ఎక్కువ ఆస్వాదిస్తుంటుంది. ఆమె వీడియోలకున్న క్రేజ్‌ చూసే లైఫ్‌స్టయిల్, సామ్‌సంగ్‌ కంపెనీ లు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు .  ఊహించని అచీవ్‌మెంట్‌’’ అంటుంది సెజల్‌. యూట్యూబ్‌ స్టార్‌ ‘బెథాని మోటా’ సెజల్‌కు రోల్‌మోడల్‌. తన చానల్‌ సబ్‌స్క్రైబర్స్‌తో మాట్లా డడం వాళ్ల కామెంట్స్‌కు రిప్లయ్‌ ఇవ్వడం అంటే సెజల్‌కు చాలా ఇష్టం.

 


logo