సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 09:28:58

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

పెను తుపానుగా కొనసాగుతోన్న అంఫాన్‌

అమరావతి : బంగాళాఖాతంలో అంఫాన్‌ తుపాను కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుపానుగా కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొంది. పారాదీప్‌కు దక్షిణ దిశగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. డిగా(బెంగాల్‌)కు దక్షిణ నైరుతి దిశగా 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర ఈశాన్య దిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా తుపాను ప్రయాణిస్తుంది. రేపు మధ్యాహ్నం బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ తీరం హతియా దీవుల వద్ద తీరం దాటే సూచన ఉంది. అత్యంత తీవ్ర తుపానుగా మారి తీరం దాటే సూచన ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 165 -195 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 


logo