బుధవారం 27 మే 2020
National - May 19, 2020 , 02:41:21

టాలీవుడ్ హీరోయిన్ సెన్సే షనల్ ప్రకటన

టాలీవుడ్ హీరోయిన్ సెన్సే షనల్ ప్రకటన

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 50కి పైగా చిత్రాల్లో నటించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ . ఈ మధ్య నిర్మాతగామారిన విషయం తెలిసిందే. జ్యోతిలక్ష్మి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన హీరోయిన్ పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై వరుసగా పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నది. ఇక గతేడాది ఇస్మార్ట్ శంకర్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తాను స్క్రీన్‌పై కనిపించనని వెల్లడించింది."జ్యోతిలక్ష్మి సమయంలోనూ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకున్నా. అయితే నటించకూడదని అని నువ్వు నిర్ణయించుకుంటే నటనకు దూరంగా ఉండు.. కానీ బయటికి చెప్పకు అని నిర్మాత కల్యాణ్‌ తెలిపారు. అందుకే దానిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు చెబుతున్నా. యాక్టింగ్‌కి దూరంగా ఉంటా" నని ఆమె సంచలన ప్రకటన చేశారు . ఇక ఫైటర్‌ తరువాత రెండు భారీ చిత్రాలను నిర్మించబోతున్నట్లు తెలిపిన ఛార్మీ.. వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తున్న "ఫైటర్‌ " సినిమాను కరణ్‌ జోహర్‌తో కలిసి ఛార్మీ నిర్మిస్తున్నారు. 


logo