శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 02:13:36

ఏక్తాకపూర్‌పై కేసు నమోదు

 ఏక్తాకపూర్‌పై  కేసు నమోదు

హైదరాబాద్‌: బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్‌పై సైబర్‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలాజీ టెలీఫిలింస్ నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో ఆర్మీ డ్రెస్‌ను అభ్యంతరకర రీతిలో చూపించారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు విశాల్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫాంను అపహాస్యం చేశారని తెలిపారు. ఫేస్‌బుక్ పేజీలో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారన్నారు. ఓ ఆర్మీ అధికారి భార్య, వేరే వ్యక్తికి మధ్యనున్న సంబంధాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఫిర్యాదు సవీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలను పరిశీలించి ఏక్తాకపూర్‌కు నోటీసులు పంపుతామని పేర్కొన్నారు.

 


logo