బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 00:49:04

స్ట్రా బెర్రీస్ తో పాన్‌కేక్‌ ఇలా ...

స్ట్రా బెర్రీస్ తో పాన్‌కేక్‌ ఇలా ...

కావల్సినవి : మైదా - 1 కప్పు, వాల్నట్‌ - 2 స్పూన్లు (తరిగినవి), బేకింగ్‌ పౌడర్‌ - 1/2 స్పూను, ఎండుద్రాక్ష - 3 స్పూన్లు, బ్రౌన్‌ షుగర్‌ - 1 కప్పు, వెనిలా ఎసెన్స్‌ - 4 చుక్కలు, గుడ్లు - 3, వెన్న - 1/2 కప్పు, లెమన్‌ జెస్ట్‌ - 1 స్పూను, చెర్రీస్‌ - 2 స్పూన్లు, (సగం గార్నిషింగ్‌ కోసం) ... తయారీ  విధానం : మైదా , బేకింగ్‌ పౌడర్‌ను ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో వాల్‌నట్స్‌, ఎండుద్రాక్ష వేసి బాగా మిక్స్‌ చేయాలి. మరో బౌల్లో, బటర్‌, బ్రౌన్‌ షుగర్‌ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇది బాగా క్రీమ్‌లా తయారయ్యే వరకూ మిక్స్‌ చేయాలి. తర్వాత అందులో వెనీలా ఎసెన్స్‌, గుడ్డు, లెమన్‌ జెస్ట్‌ వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మైదా, బేకింగ్‌ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా మిక్స్‌ చేయాలి. ఇప్పుడు కేక్‌ టిన్‌కు నెయ్యి అప్లై చేసి, తర్వాత అందులో పైన రెడీ చేసుకొన్న కేక్‌ మిశ్రమాన్ని పోయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని 20 నిమిషాలు (అవెన్‌లో గానీ, ప్రెషర్‌ కుకర్‌లో) బేక్‌ చేసి చల్లారనివ్వాలి. అంతే క్రిస్మస్‌ ప్లమ్‌ కేక్‌ తినడానికి రెడీ. దీన్ని స్లైస్‌గా కట్‌ చేసి సగం చెర్రీలను గార్నిష్‌ చేయాలి.  logo