సోమవారం 01 జూన్ 2020
National - May 17, 2020 , 00:25:12

రూ.1.5కోట్లు విరాళం అందించిన లాక్టాలిస్ ఇండియా

 రూ.1.5కోట్లు  విరాళం అందించిన లాక్టాలిస్ ఇండియా


ముంబై:  అతిపెద్ద డెయిరీ సంస్థ లాక్టాలిస్ ఇండియా, కరోనా మహహ్మారి పై దేశం చేస్తున్న పోరాటానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. పీఎం కేర్ ఫండ్స్ కు రూ. 1 కోటి విరాళం అందించింది.  పీఎం కేర్ ఫండ్స్ కు అందించిన విరాళానికి అదనంగా, లాక్టాలిస్ ఇండియా సిబ్బంది స్వచ్ఛందంగా ఇ చ్చిన విరాళానికి కంపెనీ తన వంతుగా ఇచ్చిన  మొత్తంతో కలిపి రూ.50 లక్షలను అందించింది. లా క్టాలిస్ ఇండియా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాట క, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లలో ఈ విరాళాన్ని రాష్ట్రపాలనాయంత్రాంగాలకు ఈ విరాళాన్ని అం దించనున్నది.   ‘‘కోవిడ్ -19 పై జరుగుతున్న పోరులో దేశంతో కలసి పని చేస్తున్నది లాక్టాలిస్ ఇండియా. నిత్యావసర సేవల సం స్థలైన ప్రభాత్, అనిక్, తిరుమల సంస్థల సిబ్బంది కూడా దేశవ్యాప్తంగా నిరాటంకంగా పాల సరఫరా చేసేందుకు  కృషి చేస్తున్నారని లాక్టాలిస్ ఇండియా ఎండీ రాహుల్ కుమార్ తెలిపారు. "మేం మా పాలసేకరణను పెంచాం , ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలుస్తున్నాం.  బాధ్యతాయుత సంస్థగా  లాక్టాలిస్ ఇండియా అన్ని రకాలుగా రైతులకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నదని ఆయన వెల్లడించారు. 


logo