గురువారం 04 జూన్ 2020
National - May 16, 2020 , 22:01:33

ఏపీ లో రమాకాంత్ రెడ్డికి కీలక పదవి

ఏపీ లో రమాకాంత్ రెడ్డికి కీలక పదవి


విజయవాడ:  ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎస్‌గా పనిచేసిన రమాకాంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు రంగం సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ఉమ్మడి ఏపీ సీఎస్‌గా పనిచేశారు. ఇక వైయస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్య ఏపీకి సీఎం అయ్యారు. ఆయన హయాంలో కొంతకాలం సీఎస్‌గా పనిచేశారు రమాకాంత్ రెడ్డి. ఇక సీఎస్‌గా పదవీవిరమణ పొందిన తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో పలు శాఖల్లో పని చేసిన అనుభవం రమాకాంత్ రెడ్డికి ఉన్నది. 


logo