గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 21:53:24

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత


 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చారు. అక్కుల చెరువును పరిశీలిం చారు. నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కుల చెరువు అభివృద్ధి నిధులు భారీగా నిరుపయోగంగా అయ్యాయన్నారు. ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతోందని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చే శారు సుచరిత. అక్కుల చెరువును నింపడానికి కావాల్సిన గ్రావిటీ పైప్ లైన్ పనులు, గ్రామాలకు నీరు పంపించే పనులు ఏ మాత్రం జరగలేద ని హోమ్ మంత్రి వివరించారు. logo