ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 20:42:16

ద్రౌపది పాత్ర నటికి నిజజీవితం లోనూ అదే జరిగింది..

 ద్రౌపది పాత్ర నటికి నిజజీవితం లోనూ అదే జరిగింది..

 హైదరాబాద్: మహాభారత్ లో సీరియల్లో ద్రౌపది పాత్రతో బెంగాలీ నటి రూపా గంగూలీ విశేషమైన ప్రజాదరణ పొందింది. ఆ సీరియల్లో వస్త్రాపహరణం సన్నివేశంలో ద్రౌపది గా అద్భుతంగా నటించింది. అయితే తనకు నిజజీవితంలోనూ వస్త్రాపహరణం తరహా ఘటన ఎదురైందని రూపా చెప్తున్నది.  2016లో రాజకీయాల్లో కి ప్రవేశించిన సమయంలో ప్రతి పక్ష పార్టీ కి చెందిన వ్యక్తులు తనపై దాడి చేశారని వివరించారు. కోల్ కతా లోని డైమండ్ హార్బర్ వద్ద తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, చీర లాగేశారని వెల్లడించింది. తన తలను కారుకేసి కొట్టారని, దాంతో ఓ కన్ను పోయినంత పనైందని ఆమె వాపోయింది. 


logo