ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 20:34:10

విశాఖలో అర్ధనగ్నంగా డాక్టర్‌ నిరసన

విశాఖలో అర్ధనగ్నంగా డాక్టర్‌ నిరసన

విశాఖ వీధుల్లోకి అకస్మాత్తుగా అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసారు డాక్టర్‌ సుధాకర్‌. నర్సీపట్నంలో డాక్టర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ ఈ మద్యనే ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ప్రభుత్వం తమకు కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ విమర్శలు చేసి పెద్ద చర్చకు దారి తీసారు. ఆస్పత్రుల్లో వైద్యులకు కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. రోడ్డుపైకి అర్ధనగ్నంగా రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని విశాఖ నాలుగవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చికిత్స కోసం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. డాక్టర్‌ సుధాకర్‌ మద్యం సేవించి ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.


logo