బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 22:28:13

పిసి తో వాట్సాప్ వీడియో కాల్స్ ఇలా ...

 పిసి తో వాట్సాప్ వీడియో కాల్స్ ఇలా ...


వినియోగదారులు తమ పర్సనల్ కంప్యూటర్ లను ఉపయోగించి వాట్సాప్ వీడియో కాల్స్ చేయడానికి అనుమతించే మార్గం ఉన్నది. అదెలాగో తెలుసుకుందాం .. ల్యాప్‌టాప్ నుండి వాట్సాప్ వీడియో కాల్స్ చేసే పద్ధతులు ఇంటర్నెట్ నుండి ఏదైనా విశ్వసనీయ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్‌ను డౌన్‌లోడ్ చేసి దాన్ని మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయండి. మ్యులేటర్ ఇన్‌స్టాల్ చేయడం పూర్తి అయిన తర్వాత వాట్సాప్ ఏపీకే  ఫైల్‌ను సైడ్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌ను సెటప్ చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి. ఇందులో మీ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి. తరువాత ఫైళ్లు, కెమెరా,మైక్రోఫోన్‌లు వంటి అవసరమైన అనుమతులను ఇవ్వండి. అనుమతులను ఇవ్వడం పూర్తయిన తర్వాత ఎమ్యులేటర్ల డైరెక్టరీలో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి. లేదా మీరు మీ ఫోన్ వలె అదే గూగుల్ అకౌంటును ఉపయోగించినట్లయితే వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో మీరు ఫోన్ చేయవలసిన కాంటాక్ట్ కోసం చూడండి. వీడియో ఫోన్ కాల్ ప్రారంభించడానికి వీడియో కాల్ ఐకాన్‌పై నొక్కండి. అంతే వీడియో కాల్స్ ద్వారా అవతలి వ్యక్తితో మాట్లాడవచ్చు. 


logo