శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 21:51:19

అక్కడ లాక్ డౌన్ లోనూ జాతర

అక్కడ లాక్ డౌన్ లోనూ  జాతర


బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా.  ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉన్నందున ఎవ్వరు కూడా గడప దాటి బయటికి రాకుండా ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. ఈ పని మీదే పోలీసులు రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రస్తుతానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి. వందలాది మందితో.. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జాతరను నిర్వహించారు. గ్రామదేవతకు ఏటేటా నిర్వహించే జాతరను ఈ సారి కూడా వైభవంగా జరిపించారు. ఈ ఉత్సవానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ.. జిల్లా నలుమూలల నుంచీ భక్తులు అమ్మోరిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు నుంచి కూడా ఈ జాతరకు హాజరయ్యారు భక్తులు. అమ్మోరి దయ ఉంటే తమ గ్రామానికి ఎలాంటి మహమ్మారి సోకదని చెబుతున్నారు. ఏటేటా జాతర.. ఆ ఊరి పేరు కోలగొండనహళ్లి. రామనగర జిల్లాలో ఉంటుందీ గ్రామం. ఇక్కడ వెలసిన మారెమ్మ అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తుంటారు స్థానికులు. ప్రతి సంవత్సరం మే నెలలో అమ్మోరికి జాతరను నిర్వహిస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పొంగలి, సల్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతరను నిర్వహించడం తొలుత అనుమానాలు నెలకొన్నాయి. గ్రామస్తులు మాత్రం దీన్ని పట్టించుకోలేదు.  

  


logo