గురువారం 28 మే 2020
National - May 15, 2020 , 21:35:01

ఫిలాటెక్స్ ఇండియా కార్యకలాపాలు పునరుద్ధరణ

ఫిలాటెక్స్ ఇండియా కార్యకలాపాలు పునరుద్ధరణహైదరాబాద్:  సుప్రసిద్ధ సంస్థ  ఫిలాటెక్స్ ఇండియా లిమిటెడ్ తమ దాద్రా ప్లాంట్‌లో పాక్షికంగా కార్యకలాపాలను పునరుద్ధరించడం ద్వారా ఫేస్ మాస్కులు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లతోపాటు, రక్షణ మంత్రిత్వశాఖ అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే వస్త్రాలను సైతం తయారు చేసేందుకు అవసరమైన నూలును ఉత్పత్తి చేస్తున్నది. దాద్రా ప్లాంట్ ఇప్పుడు తమ ఉత్పత్తిని భౌతిక దూరం, పారిశుద్ధ్య ప్రమాణాలతో పాటు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ప్రారంభించింది." పీపీఈ కిట్ల తయారీదారులు ,ఇతర రంగాల నుంచి ప్రత్యేక అవసరాల వస్త్రాల కోసం మాకు ఎక్కువ డిమాండ్ వస్తున్నది. రాబోయే రెండు మూడు నెలల్లో సాధారణ స్థాయి ఉత్పత్తిని పునరుద్ధరించగలమని భావిస్తున్నాం. అలాగే పొరుగు దేశాలతో పోలిస్తే ఇండియాకు అత్యధిక శాతం ఆర్డర్లు వస్తాయని కూడా అంచనా వేస్తున్నాం" అని  ఫిలాటెక్స్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ భగేరియా తెలిపారు. 


logo