బుధవారం 27 మే 2020
National - May 15, 2020 , 20:58:41

క్వారంటైన్ సెంట‌ర్ మూసివేత‌ ఎందుకో తెలుసా?

క్వారంటైన్ సెంట‌ర్ మూసివేత‌ ఎందుకో తెలుసా?

ఇంఫాల్ : క‌రోనా నేప‌థ్యంలో మణిపూర్ లో ఏర్పాటు చేసిన‌ క్వారంటైన్ సెంట‌ర్ లో ఉన్న ఓ రోగికి క‌రోనా పాజిటివ్ వచ్చింది. దీంతో క్వారంటైన్ సెంట‌ర్ ను అధికారులు మూసివేశారు. మ‌ణిపూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని జామియా గ‌లినా అజిజ్ గ‌ర్ల్స్ కాలేజీని ఇటీవ‌లే క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్య‌క్తికి పాజిటివ్ గా తేల‌డంతో క్వారంటైన్ సెంట‌ర్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా నిర్దారించారు. క్వారంటైన్ కేంద్రం నిర్వ‌హిస్తున్న భ‌వ‌నాన్ని పూర్తిగా మూసివేశారు.  పాజిటివ్ వ‌చ్చిన 31 ఏండ్ల వ్య‌క్తిని జ‌వ‌హ‌ర్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లోని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు.  


logo