శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 20:42:14

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి అనుమతి

 ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి అనుమతి


విజయవాడ :  ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంయితే  టిక్కెట్లను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా టైమ్ స్లాట్ నిర్దార‌ణ చేసుకోవడానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 24 గంటల ముందుగానే స్లాట్ క‌న్ఫామ్ అయ్యేలా దేవస్థానం బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద‌ర్శ‌నానికి అనుమతి ఇవ్వాల‌ని అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నెంబర్‌తోపాటు దర్శన సమయాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా భక్తులు తెలపనున్నారు. అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా శఠగోపం, తీర్థం పంపిణి, అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


logo