శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 18:58:08

పదిహేను వసంతాల సంబురాల్లో "జీ "తెలుగు

పదిహేను వసంతాల సంబురాల్లో


హైదరాబాద్ : లాక్ డౌన్ సమయంలో ఇంటిల్లపాదిని అలరించేందుకు సరికొత్త వినోద కార్యక్రమాలను అందిస్తున్నది. జీ తెలుగు 15వ వార్షికోత్సవం సందర్భంగా  ‘అనుబంధానికి పదిహేనేళ్లు’ పేరుతో అద్భుతమైన కార్యక్రమాలను సిద్ధం చేసింది. అందులో భాగంగా మే18 నుంచి ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు.. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వినోద కార్యక్రమాలను అందించనున్నది. అద్భుతమైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని గారడి చేసిన అమృతం సీజన్‌ 1, అలాగే అద్భుతమైన పొలిటికల్‌ డ్రామా అయిన క్వీన్‌ను రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రసారం చేయబోతున్నది. ఈ రెండు కార్యక్రమాలు ఎక్స్‌క్లూజివ్‌గా జీ తెలుగు ,జీ తెలుగు హెచ్ డీ చానెల్స్‌లో మాత్రమే ప్రసారం కానున్నాయి. గత 15 ఏండ్లుగా జీ తెలుగులో ప్రసారమైన అద్భుతమైన కార్యక్రమాలు అన్నీ ఒక్కసారి మళ్లీ మీ కళ్లముందు కదలాడే వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా 15 ఏండ్లుగా జీ తెలుగుతో తమకున్న అనుబంధాన్ని కూడా నటీనటులు తమ మాటల్లో ఆవిష్కరించబోతున్నారు. వీటితో పాటు జీ కుటుంబం సభ్యులు చేసిన అద్భుతమైన మైండ్‌ బ్లోయింగ్‌ పర్‌ఫార్మెన్స్‌లు మే 18 ఉదయం 11:30 గంటలకు ప్రసారం కానున్నాయి.  logo