బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 18:23:05

రక్షకభటుల పై దాడికి దిగిన దుండగులు

 రక్షకభటుల పై దాడికి  దిగిన దుండగులు


 ముంబయిలో కొందరు దుండగులు రక్షకభటుల పై దాడికి పాల్పడ్డారు. మాస్కు ధరించమన్నందుకు పోలీసులనే చితక్కొట్టారు. ఈ దాడిలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. ముంబైలోని అంటోప్ హిల్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నియమాలను అతిక్రమించి కొందరు వ్యక్తులు రోడ్లపైకి వచ్చారు. కనీసం ఫేస్‌ మాస్కులు కూడా ధరించలేదు. నిబంధనలను  ఎందుకు ఉల్లంఘించారంటూ పోలీసులు వారిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఒక్కసారిగా రెచ్చిపోయిన యువకులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లతో సహా ముగ్గురు పోలీసు సిబ్బందిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 


logo