ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 16:48:18

హెల్త్ స్క్రీనింగ్ వెబ్ యాప్ ను ప్రారంభించిన అమర రాజ గ్రూప్

  హెల్త్ స్క్రీనింగ్ వెబ్ యాప్ ను ప్రారంభించిన అమర రాజ గ్రూప్


తిరుపతి :  ప్రముఖ ఆటోమోటివ్ బ్యాటరీ సంస్థ అమర రాజ గ్రూప్ తమ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా  కరోనా నేపథ్యం లో 16వేల మంది ఉద్యోగులకు హెల్త్ స్క్రీనింగ్ వెబ్ యాప్ ను ప్రారంభించడంతో పాటు ,డిజిటల్ ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అమర రాజ గ్రూప్ ప్రకటించింది.  ఈ వెబ్ యాప్, ఆన్లైన్ స్క్రీనింగ్ సాధనాన్ని అందిస్తుంది.  ఆ సాధనంలో కరోనావైరస్ వ్యాధి గురించిన సమాచారాన్ని అందించడంతో పాటు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ఆరోగ్య మంత్రిత్వ శాఖ ల మార్గదర్శకాల జాబితాను అందిస్తుంది.  ఒక ఉద్యోగి కరోనా బారిన పడితే ఎంత ప్రమాదమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ‘అమరా రాజా పీపుల్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ARPSMS) అనే వెబ్ యాప్ ను  డాక్సివా సహకారంతో రూపొందించారు. అమర రాజ సంస్థ ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ -19 స్వీయ స్క్రీనింగ్ అసెస్మెంట్ సాధనాలను ఉపయోగించి వ్యాధి ప్రమాదాన్నిగుర్తించే అవకాశాన్ని అందిస్తున్నారు. అమరా రాజా ఉద్యోగులందరూ కరోనా లక్షణాలు , ఎక్స్ పో జర్ హిస్టరీ కోసం రోజువారీ ప్రాతిపదికన పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను పూరించాలి. దీని ఆధారంగా వెబ్ యాప్ స్వయంచాలకంగా తాత్కాలిక ఇ-వర్క్ పాస్ ను జారీ చేస్తుంది.  ఈ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ లతో ఉన్న వివరణాత్మక యూజర్ గైడ్ ను ఉద్యోగులందరికీ అందించారు. ఉద్యోగుల డిజిటల్ ప్లాట్ ఫామ్  ‘WE @ AR’. జియో ట్యాగింగ్ ను ఉపయోగించి, సంస్థ ఉద్యోగి స్థానాన్ని అర్థం చేసుకోగలదు. సేకరించిన  డేటా ఏదేని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అందుబాటులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అమరా రాజా ఉద్యోగులందరికీ భారత ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య సేతు యాప్ ను   ఉపయోగించుకోవాలని  అమరరాజా గ్రూప్  ప్రెసిడెంట్  గల్లా విజయ నాయుడు   సూచించారు. "కొత్తగా ప్రారంభించిన అమరా రాజా పీపుల్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉద్యోగుల డిజిటల్ ప్లాట్ ఫామ్ 'WE @ AR'  మా ఉద్యోగులందరితోపాటు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండటానికి  ఇది ఏంతో  ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అమరా రాజా పీపుల్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్ యాప్ తెలుగు ,ఆంగ్ల భాషల్లో లభిస్తున్నది.  Note: <p>ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి<font color="#ff0000"> ..<b> <a href="https://t.me/NamastheTelangana" target="_blank">టెలిగ్రామ్</a></b></font><b> </b>యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..<br></p>

Telegram
Namasthe Telangana - Telugu News Updates
Visit Our Website
https://www.ntnews.com


logo