శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 15:22:23

తొలి తెలుగు పాటల పుస్తకం గురించి తెలుసా?

తొలి తెలుగు పాటల పుస్తకం గురించి తెలుసా?

హైదరాబాద్: సాంకేతికత అందుబాటులోకి రావడంతో సినిమా ముహూర్తం షాట్ నుంచి  నుంచి విడుదల వరకూ అన్నిటికీ యూట్యూబ్ వేదిక అవుతున్నది. చిత్రపరిశ్రమ ప్రారంభమైన తొలి నాళ్ల లో సినిమాకు సంబంధించిన ప్రచారం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పుడు  ఇంతగా టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి . సినిమా ప్రచారం కోసం పాటల పుస్తకం  రూపొందించారు అప్పటి ప్రచారకర్తలు. తొలిసారిగా "సతీ సావిత్రి"  సినిమాకి పాటల పుస్తకం వేశారు. దీనిని ఈస్టిండియా కంపెనీ వారు ముద్రించారు. అందులో పాటలు, నటీనటులు, ఇతరుల పేర్లు వున్నాయి. దాని వెల ఒక కాణీ. అంతకు ముందే హిందీ సినిమాకి పాటల పుస్తకాలు వచ్చాయి. హిందీ సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో విడుడలైతే పాటలు, వివరాలు తెలుగు లిపిలో వేసేవారు. "సతీ సావిత్రి" 1933లో ఈస్టిండియా పిలిమ్స్ నిర్మించిన ,సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన తెలుగు సినిమా. మైలవరం జమిందారు స్థాపించిన "బాలభారతీ సమాజం " ప్రదర్శించిన నాటకానికి ఈ చిత్రం అనువాదం . ఇది ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ భారీ బడ్జెట్ తో నిర్మించింది. అప్పట్లో రూ.75,000 లతో నిర్మించిన ఈ సినిమా భారీ హిట్ చిత్రం గా నిలిచింది

Note:

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo