బుధవారం 27 మే 2020
National - May 15, 2020 , 00:28:58

కేంద్రం మరో కీలక నిర్ణయం

కేంద్రం మరో కీలక నిర్ణయం


ఢిల్లీ :  కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధ మవుతున్నది. కేంద్ర ఉద్యోగులు ఇకపై యేడాదికి 15 రోజులు ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నది. తాజా పరిణామాల దృష్ట్యా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర సచివాలయంలో సామాజిక దూరం పాటించడంతో పాటు పనివేళల్లో మార్పులు… ఇతరత్రా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.వర్క్‌ఫ్రం హోం నుంచి పనిని సులభతరం చేయడానికి, అన్ని మంత్రిత్వ శాఖలు, అనుబంధ విభాగాలలో ఇ-ఆఫీస్ అమలును డీవోపీటీ ప్రతిపాదించింది. ఇప్పటికే కేంద్రంలోని 75 మంత్రిత్వ శాఖలు డిజిటల్ వేదికగా రోజువారీ కార్యకలాపాలు ప్రారంభించాయి. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నకేంద్ర హోంశాఖ హెచ్చరికలతో.. ఆయా మంత్రిత్వ శాఖల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నది. పార్లమెంట్‌తో పాటు వీఐపీ ప్రశ్నల విషయంలో మాత్రం ఒక ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ చేసేందుకు ఓ వ్యవస్థను రూపొందించినట్లు సమాచారం. ఫైల్‌ను ప్రాపెస్ చేసే సమయంలో చైన్ ఆఫ్ కమాండ్‌ వ్యవస్థను అనుసరించాలని అధికారులు భావిస్తున్నారు.


logo