మంగళవారం 01 డిసెంబర్ 2020
National - May 14, 2020 , 22:19:42

విశాఖ ఎల్జీ బాధితులకు చెక్కుల పంపిణీ

విశాఖ ఎల్జీ బాధితులకు చెక్కుల పంపిణీ

 వైజాగ్: ఎల్జీపాలిమర్స్ ఘటనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంచి మనస్సున్న మనిషిగా స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖకు వచ్చి బాధితులకు మనోధైర్యాన్నిచ్చారని రాష్ర్ట టూరిజం శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన గురువారం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు చెక్కుల పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన రోజున అందరూ షాక్ లో ఉన్నప్పటికీ, నేనున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాధితుల్లో భరోసా నింపారని ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన స్పూర్తితో ఐదుగురు మంత్రులు,ముగ్గురు పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ ఏలు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేసి బాధితులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు.