బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 21:50:42

కర్నూల్లో కరోనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం

కర్నూల్లో కరోనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం

కర్నూలు: కరోనా వైరస్ విధ్వంసక చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శక సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను కేంద్ర బృందం ప్రతినిధులు ఆదేశించారు. గురువారం నగర శివారు ప్రాంతంలోని కర్నూలు చైతన్య కాలేజ్ కోవిడ్ కేర్ సెంటర్ ను కేంద్ర బృందం పరిశీలించింది. కోవిడ్ కేర్ సెంటర్, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కేంద్రాలలో ప్రభుత్వం సూచించిన కరోనా ప్రోటోకాల్ ప్రకారం బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్వారంటైన్ స్పెషల్ అధికారి, డి ఎఫ్ ఓ అలెన్ చాంగ్ టేరాన్ కోవిడ్ కేర్ సెంటర్ లో చేసిన ఏర్పాట్లపై నివేదించారు. కోవిడ్ కేర్ సెంటర్ లో బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయం కల్పిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో జిల్లా యంత్రాంగం కల్పించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి కరోనా వ్యాధి నివారణపై ముమ్మర ప్రచారం చేయాలన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చైతన్యవంతులను చేయాలని వారు సూచించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండి ప్రభుత్వం చేపట్టే పనులకు సహకారం అందించాలని కోరారు. 


logo