శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 21:30:03

మోదీకి సీఎం జగన్‌ లేఖ

  మోదీకి సీఎం జగన్‌ లేఖ


అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిపదవీ కాలాన్ని మరో  ఆరు నెలలు కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాని వెూదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.   సీఎం ఇటీవల ప్రధానికి లేఖ రాశారు. నీలం సాహ్ని జూన్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సీఎస్‌ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలని కోరారు జగన్ . రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరోకు పదకొండు మంది ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ ఐపీఎస్‌లకు పలు జిల్లాల్లో కొత్తగా ఎస్‌ఈబీ పోస్టును ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్‌  ఉత్తర్వులు జారీ చేశారు.


logo