శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 21:17:34

వాణిజ్య పంటలు పండించే రైతులను ఆదుకోండి: ఫైఫా

వాణిజ్య పంటలు పండించే రైతులను ఆదుకోండి:  ఫైఫా


న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలలోని లక్షలాది మంది వాణిజ్య పంటల రైతులు ,కార్మికుల  లాకా డౌన్ కారణంగా తీవ్రంగా నష్ట పోతున్నారు.  అటువంటి వారి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నసంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్(ఫైఫా) స్పందించింది. ప్రస్తుత సంక్షోభ కాలంలో వాణిజ్య పంటలు పండించే రైతుల జీవనోపాధిని కాపాడాలని భారతప్రభుత్వాన్ని అభ్యర్థించింది . సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్ కొనసాగుతుండటం కారణంగా సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గడంతో తమ పంటలకు డిమాండ్ కూడా తగ్గింది. ఎఫ్‌సీవీ టొబాకో వ్యవసాయదారులు తమ దిగుబడులను విక్రయించడానికి ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు లేబర్, మౌలిక వసతుల ఖర్చులు సైతం అధికం కావడం, లాక్‌డౌన్ కారణంగా వేలానికి అంతరాయం కలుగడం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో  కూరుకుపోతున్నారు. దాదాపు 1700 కోట్ల రూపాయల విలువైన 130 మిలియన్ కేజీల ఫ్లూ క్యూర్డ్ పొగాకు అమ్మకానికి సిద్ధంగా ఉంది. అయితే పొగాకు వేలం ఇప్పుడు నత్త నడక నడుస్తుండటం ... సుదీర్ఘకాలపు నిల్వ కారణంగా నాణ్యత పడిపోతుందని ఫైఫా తెలిపింది. పొగాకు ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం నిషేదించడం తో సంబంధిత వ్యాపారులు , రైతులు  తీవ్రంగా నష్ట పోతున్నారని, అటువంటి వారిని ఆదుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్స్ భారతప్రభుత్వాన్ని కోరింది.  


logo