మంగళవారం 26 మే 2020
National - May 14, 2020 , 20:50:06

రెండురోజుల్లో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తాం : విజయసాయిరెడ్డి

రెండురోజుల్లో మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తాం : విజయసాయిరెడ్డి

అమరావతి: గ్యాస్ లీక్ వల్ల అస్వస్ధతకు గురైన వారందరూ డిశ్చార్జ్ అయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. కేజిహెచ్ లో మాత్రం ముగ్గురు పేషంట్లు చికిత్స పొందుతున్నారు. వారు కూడా డిశ్చార్జ్ అవడానికి సిధ్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్ చెప్పినట్లు అన్నిగ్రామాలలో రెండురోజులలో మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుంది. పర్మినెంట్ ఆస్పత్రి కూడా నిర్మించాలని ఆయన ఆదేశించారని  విజయసాయిరెడ్డి  తెలిపారు. పదివేల రూపాయల పరిహారానికి సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తి అయ్యాక పరిహారానికి అర్హులైన వారందరికి  డైరక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ స్కీమ్  కింద వారి అకౌంట్లకు నగదు జమ అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు అయన వెల్లడించారు. 


logo