ఆదివారం 31 మే 2020
National - May 14, 2020 , 20:31:44

ఏసర్ స్మార్ట్ టీచింగ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్

  ఏసర్ స్మార్ట్ టీచింగ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్

హైదరాబాద్: విద్యా వనరులను విస్తరించడానికి, ఉపాధ్యాయులకు మెరుగైన బోధనకు సహాయపడటానికి ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ బ్రాండ్లలో ఒకటైన ఏసర్,  ప్రముఖ నాలెడ్జ్ నెట్‌వర్క్- ఐపిఎన్ (ఇండియన్ ప్రిన్సిపల్స్ నెట్‌వర్క్) తో ఒప్పందం చేసుకున్నాయి .  లాక్డౌన్ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు సరైన సాంకేతికత అందించడంతోపాటు మెరుగైన విద్యాసేవలందించడానికి  ఏసర్సిద్ధమైంది. భవిష్యత్ లో  ఇ-లెర్నింగ్  తప్పనిసరి కాబోతున్నది. అందుకోసమే ఏసర్, ఐపిఎన్ "స్మార్ట్ టీచింగ్ ఇనిషియేటివ్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ప్రత్యేక కూపన్ కోడ్‌ను ఉపయోగించే ఉపాధ్యాయులకు అదనపు  తగ్గింపు, 2 సంవత్సరాల వారంటీ, 1 సంవత్సరం యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ను అందిస్తున్నట్లు ఏసర్ ప్రకటించింది. 4,500పైగా పాఠశాలలకు ఈ కార్యక్ర సహాయపడుతుందని ఆ సంస్థ పేర్కొన్నది. logo