శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 17:30:33

కేజీఎఫ్‌లో ముగ్గురు మృతి

కేజీఎఫ్‌లో ముగ్గురు మృతి

కర్ణాటకలో ఉన్న ఎంతో కాలం కింద మూసేసిన బంగారు గని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో విషాదం నెలకొంది. బంగారం దొరుకుతుందన్న ఆశతో గనిలోకి వెళ్ళి ముగ్గురు వ్యక్తులు తమ ప్రాణాలనే కోల్పోయారు. గనిలో లభించే బంగారం కంటే ఖర్చు, ప్రమాదాలు ఎక్కువగా ఉన్నయనే కారణంతో 2001 లోనే ప్రభుత్వం ఆ గనిని మూసేసింది. అంతే కాకుండా ప్రజలు ఎవరూ ఆ గని లోనికి వెళ్ళకూడదని, ప్రమాదకరమని ప్రకటించింది. అయినా యాక్షన్‌ మూవీలోలాగా సాహసం చేసి తమ పేదరికాన్ని దూరం చేసుకోవాలనుకున్నారు స్కంద, జోసెఫ్‌, పడయప్ప, మరో కొందరు అయితే తాడు సహాయంతో కొందరు ముందే లోపలికి దిగారు.

ఊపిరి ఆడడం లేదంటూ అరుపులు వినపడడంతో వారిని కాపాడేందుకు పైన ఉన్న వారు ఒక్కొక్కరిగా తాడు సహాయంతో పైకి లాగేందుకు ప్రయత్నించారు. ఒకరిని సురక్షితంగా పైకి లాగినా మిగిలిన ఇద్దరు చప్పుడు లేకపోవడంతో పైన ఉన్న పడయప్ప లోపల ఉన్న అతని తండ్రి స్కంద కోసం లోపలికి తాడు సహాయంతో దిగాడు. ఆ తరువాత అతను కూడా చప్పుడు లేకపవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పైన ఉన్న వారు. ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ఆక్సీజన్‌ సిలిండర్లతో లోపలికి దిగగా పడయప్ప తప్ప మిగిలిన ఇద్దరి శవాలు లభ్యమయ్యాయి.


logo