గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 00:21:02

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం


విజయవాడ: ఏపీ లో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా సీఎం వైఎస్ జగన్ సర్కారు కీలక  నిర్ణయం తీసుకున్నది. స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ఇష్టం వచ్చినంత మంది విద్యార్థులను, ఇష్టం వచ్చినన్ని సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో సెక్షన్‌లో అత్యధికంగా 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. 4 సెక్షన్ల నుంచి 9 సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.


logo