మంగళవారం 26 మే 2020
National - May 13, 2020 , 23:06:55

50 శాతం సీట్లు మాత్రమే

 50 శాతం సీట్లు మాత్రమే

విజయవాడ : గతంలో వంద శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుంచి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండటం తో టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు తప్ప చేతికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు .గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావదేవీలు తెలీని ప్రజలు ... ఆన్ లైన్ బస్ బుకింగ్ అంటే తిప్పలే ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని బస్సులను నడపాలని సర్కార్ భావిస్తు న్నది కానీ అది ఆర్టీసీకి నష్టం చేకూరుస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ఇప్పటికే ఎప్పుడెప్పుడు బస్సులు తిరుగుతాయ అని చూస్తున్న వారికి ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కాసింత ఊరట కలిగించినా , ఆన్ లైన్ బుకింగ్ మాత్రంకాస్త ఇబ్బందే.  


logo