శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 22:08:29

విశాఖకు దక్షిణకొరియా బృందం

విశాఖకు దక్షిణకొరియా బృందం

విశాఖపట్నం: గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులతో పాటు బాధితులకు పరిహారం వంటి అంశాలపై ఆరా తీయను న్నది. ఉత్పత్తి, పర్యావరణ, భద్రత రంగాల్లోని నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితులను తమ బృందం కలుస్తుందని స్పష్టం చేసింది. అందించాల్సిన సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని వెల్లడించింది.


logo