శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 21:19:46

విద్యుత్ బిల్లుల ఆరోపణలపై స్పందించిన ఏపీ విద్యుత్ శాఖ

 విద్యుత్ బిల్లుల ఆరోపణలపై స్పందించిన ఏపీ విద్యుత్ శాఖ

అమరావతి: విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయనే ప్రజల ఆరోపణలపై ఏపీ విద్యుత్ శాఖ స్పందించింది.  కోటీ 45 లక్షల మంది కన్జ్యూమర్స్‌కు వచ్చిన బిల్లులను ర్యాండమ్‌గా చేక్ చేస్తామని ప్రకటించింది. బిల్లుల్లో తేడాలున్నాయని సందేహం ఉన్నవారికి వారి అనుమానాలను నివృత్తి చేస్తామని విద్యుత్ శాఖ వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వేర్వేరుగా 30 రోజులకు మాత్రమే కరెంట్ బిల్లులను అందించామని విద్యుత్ శాఖ తెలిపింది. శాస్త్రీయ దృక్పథం లేకుండా బిల్లులను భారీగా వేశామనడం సరికాదని , ర్యాండమ్ చెక్ చేసిన బిల్లులకు సంబంధించి వారి మొబైల్ నెంబర్లకు పూర్తిస్థాయి వివరాలను పంపిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గత రెండేళ్లుగా వినియోగదారుల విద్యుత్ వినియోగానికి సంబంధించి వివరాలు సైతం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని అన్నారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపు వినియోగదారులు తమ బిల్లులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లింపులు జరుపుకోవచ్చునని అన్నారు. వినియోగదారుల శ్రేయస్సే తమ ధ్యేయం అని విద్యుత్ శాఖ పేర్కొంది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు క్లోజ్ అయినా.. సాధారణ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో వేసవి టైమ్‌లో విద్యుత్ సరఫరాలో ఎలాటి విఘాతం కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.


logo