శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 19:17:57

అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు మించిన ఫేక్‌ ఖాతా

అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు మించిన ఫేక్‌ ఖాతా

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్‌-బల్టిస్తాన్‌ ప్రాంతాన్ని కొద్ది రోజుల క్రితమే వాతావరణ శాఖ కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో భాగంగా పేర్కొంటూ వాతావరణ సూచనలు చేస్తుంది. అలాగే గూగుల్‌ మ్యాప్‌లతో కూడా గతంలో సరిగ్గా దేశ సరిహద్దులు స్పష్టంగా చూపించని సంస్థ ఈ మద్యనే స్పష్టంగా భారత దేశంలో పీఓకే అంతర్బాగంగా చూపిస్తుంది. దీంతో దేశ ప్రజల్లో ఈ అంశం ఈ మద్య కాలంలో బాగా చర్చల్లో ఉంటుంది.

ఇక ఇక్కడి వ్యవహారాలకు సంబందించి భారత ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలు అయిన ప్రధాన మంత్రి కార్యాలయం, హోంమంత్రి కార్యాలయ ఖాతాలు మాత్రమే ట్విట్టర్‌ వేధికగా పలు విషయాలను సూచిస్తుంటాయి. కానీ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేక ట్విట్టర్‌ ఖాతాను ప్రభుత్వం రూపొందించలేదు. కానీ గత కొద్ది రోజులుగా ఓ ట్విట్టర్‌ ఖాతా అధికారిక ఖాతాగా చలామణి అవుతుంది. ఈ ఖాతాను అసలైన ఖాతానే అనుకుని దాదాపు 35 వేల మంది ఖాతాను అనుసరిస్తున్నారు.

అయితే ఈ రోజు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో హోంమంత్రిత్వ శాఖకు సంబందించిన అధికారిక ఖాతా ద్వారా లడఖ్‌ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేక ఖాతా లేదని ప్రకటించారు. 


logo