బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 01:19:00

ఆన్‌లైన్ ఫండింగ్ క్యాంపెయిన్ తో సాయం

 ఆన్‌లైన్ ఫండింగ్ క్యాంపెయిన్ తో సాయం


హైదరాబాద్: ప్రముఖ ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ మిలాప్ లాక్ డౌన్ కష్టకాలంలో జనాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఆన్‌లైన్ ఫండింగ్ క్యాంపెయిన్ ద్వారా  రూ . 90 కోట్లు సమీకరించింది. దేశంలో పలు ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలసకార్మికులు, రోజువారీ కూలీలకు నిత్యావసరాలు , కమ్యూనిటీ కిచెన్‌ల ద్వారా ఆహారాన్ని అందించడమే కాకుండా, ట్రాన్స్ జెండర్స్, మేల్ సెక్స్ వర్కర్లు, సర్కస్ ఆర్టిస్ట్‌లు, డ్రైవర్లు, డెలివరీ పర్సన్స్, గ్రామీణ కళాకారులు, డ్యాన్సర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు వంటి కమ్యూనిటీలకు సైతం తమవంతుగా సాయం చేస్తున్నారు. " చెన్నై, అసొం , కేరళలలో వరదలు వంటి ప్రకృతి సహజ విపత్తులు సంభవించిన సమయంలో సైతం క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించి ప్రజలను ఆదుకోగలిగామని మిలాప్ కో ఫౌండర్ అనోజ్ విశ్వనాథన్ అన్నారు.   


logo