బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 01:02:31

ఆన్‌లైన్ కాల్స్‌తో జరా జాగ్రత్త.. ట్రాయ్ హెచ్చరిక

 ఆన్‌లైన్ కాల్స్‌తో జరా జాగ్రత్త.. ట్రాయ్ హెచ్చరిక


ముంబై : ప్రస్తుతం ఫోన్ కాల్స్‌కు బదులు ఎక్కువ మంది ఆన్‌లైన్ యాప్స్ ద్వారా కాల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ యాప్స్ వినియోగం కూడా భారీగా పెరిగింది. అయితే ఈ యాప్స్ యూజ్ చేసే సమయంలో వినియోగదారులు అనేక జాగ్రత్తలు పాటించాలని టెలికాం రిగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) హెచ్చరిస్తున్నది. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అధిక బిల్లులు రావడం ఖాయమని చెబుతున్నది. కాబట్టి ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ కాల్స్‌ మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని  ట్రాయ్ సూచించింది. ఆన్ లైన్‌ కాన్ఫరెన్స్ యాప్‌లను ఉపయోగించే వారు.. పొరపాటున ఇంటర్నేషనల్ నంబర్లకు కాల్ చేస్తున్నారని.. అలా చేయడం ద్వారా.. వారి నెలవారి బిల్లులు చూసి ఖంగుతింటున్నారని ట్రాయ్ తెలిపింది. ఇలా ఇంటర్నేషనల్ కాల్స్ చేసిన వారికి అధిక మొత్తంలో బిల్లులు రావడం గమనించినట్లు తెలిపింది. కస్టమర్ కేర్ సెంటర్ల కోసం.. కొన్ని యాప్‌లు ప్రీమియం నంబర్లు, ఇంటర్నేషనల్ నంబర్లు కూడా ఇస్తున్నాయని గుర్తించినట్లు ట్రాయ్ పేర్కొంది. అయితే ఈ కాన్ఫరెన్స్ యాప్‌ల ద్వారా.. ఇంటర్నేషనల్ నంబర్లకు కాల్స్ చేస్తే.. ఐఎస్‌డీ టారిఫ్‌ల ప్రకారం ధరలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాబట్టి ముందుగా యాప్‌ల టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా చదివి.. వాటిని ఉపయోగించాలని సలహ ఇచ్చింది.


logo