శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 21:46:56

" విడ్మెడ్ యాప్" ను ప్రారంభించిన కన్నా


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  బిజెపి డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు" విడ్మెడ్ యాప్" ను రూపొందించారు. దీనిని భారత జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులు,డాక్టర్స్ ఈ యాప్  విధి విధానాలపై చర్చించారు. ప్రయాణ పరిమితుల వల్ల బాధపడుతున్న వేలాది మందికి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌తో వైద్య సంప్రదింపులు జరపడానికి బిజెపి హెల్త్ వింగ్ “బిజెపి విడ్మెడ్” యాప్‌ను ప్రారంభిచిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆస్పత్రులు , వైద్యులు వ్యక్తిగతంగా ఓపిడి సేవలను అందించలేకపోవడం వల్ల  చాలామంది ఇబ్బంది పడుతున్నారు. బిజెపి విడ్మెడ్ వృద్ధులకు, మహిళలకు వరం ,గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంటర్నెట్ ద్వారా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తమను తాము నమోదు చేసుకోవచ్చు  అని ,ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదింవచ్చునని రోగులు, మెడికల్ డాక్టర్ లేదా స్పెషలిస్ట్‌తో వీడియో సంప్రదింపుల కోసం ప్రయోగశాల  ఫార్మసీ సేవలకు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ యాప్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( జాతీయ ఆరోగ్య మండలి) ఆమోదం తెలిపింది అని తద్వారానే  ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు  భాజాపా ఈ యాప్ ను ప్రారంభించింది అని దీని ద్వారా డాక్టర్ పేషేంట్ కు పరీక్షల సలహాలు ఇవ్వడమే కాకుండా మన రిపోర్ట్స్ కూడా పంపి  నిర్ధారణ అనంతరం మన ఫోన్ నెంబర్ కు డాక్టర్ సూచించిన మందుల జాబితా వస్తుందని దీనిని మన స్థానికంగా ఉన్న మందుల షాపుల్లో అనుమతింపబడుతుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విడ్మెడ్ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ వినియోగదారుకు సహాయం అవసరమైనప్పుడు, టోల్-ఫ్రీ నంబర్, లైవ్ హెల్ప్‌డెస్క్ ఉన్నాయి, వారు సేవలను సమర్థవంతంగా పొందడంలో వినియోగదారులకు సహాయపడతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.


logo