మంగళవారం 26 మే 2020
National - May 12, 2020 , 21:04:31

పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు

 పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాలు


అమరావతి : పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సిలబస్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని సూచనప్రాయంగా ఏపీ సర్కారు నిర్ణయించింది. అందుకోసం... ప్రతీ పాఠశాలకూ ఓ ‘వాట్సాప్ గ్రూప్’ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒకే గ్రూపులో ఉంటారు.పదో తరగతి పరీక్షల కోసం... విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ‘ఆన్‌లైన్’ ద్వారా తరగతులను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్‌’లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు... తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగే... విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది. మొత్తంమీద ఈ విధానంతో... కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

 


logo