శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 20:33:33

సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందడమెలా ?

 సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందడమెలా ?


 పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీల నేపథ్యంలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.   అమాయకులపై వల విసిరి, తెలివిగా డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మోసాల బారిన మనం పడకుండా ఉండాలంటే.. ఆన్‌లైన్‌లో మన సమాచారాన్ని రహస్యంగా ఉంచడంతోపాటు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి.. అవేంటంటే ..ఖాతా వివరాల్లో తేడాలున్నాయని, వాటిని సరిచేయాలని, లేకపోతే ఖాతా రద్దవుతుందని ఎవరైనా ఫోన్‌ చేస్తే.. ఆందోళన పడకండి. వారితో మాట్లాడకండి. వెంటనే కాల్‌ను ఆపేయండి. మీ ఖాతాలో చిన్న తేడా కనిపించినా, బ్యాంకును సంప్రదించాలి. బ్యాంకు ఎప్పుడూ ఖాతాదారులకు నేరుగా ఫోన్‌ చేయదు. ఏదైనా సమస్య వస్తే.. ఖాతాదారులే వినియోగదారుల సేవాకేంద్రాన్ని సంప్రదించాలి. ఖాతా వివరాలు, పిన్‌, ఓటీపీలాంటివి అడిగారంటే.. వాళ్లు మోసగాళ్లేనని అర్థం చేసుకోవాలి. బ్యాంకు ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌లతోపాటు, మొబైల్‌ వ్యాలెట్లకు వినియోగించే ఎంపిన్‌లాంటివి మార్చుకోండి. అక్షరాలు, అంకెలు, సంజ్ఞలతో పాస్‌వర్డ్‌ కఠినంగా ఉండేలా చూసుకోవాలి.ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్లు లేదా ఇ-మెయిళ్లను పంపించి.. మన ఆరోగ్య సమాచారాన్ని అడుతున్నట్లు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీ బ్యాంకు ఖాతాలోకి నేరుగా బదిలీ చేస్తామంటూ చెప్పి, మన సమాచారాన్ని సేకరిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకండి. ఇ- మెయిళ్లలో ఇచ్చిన లింకులను క్లిక్‌ చేయొద్ధు.  అత్యవసర మందులు సరఫరా చేస్తామంటూ.. ఎన్నో కొత్తకొత్త లింకులు మనకు సంక్షిప్త సందేశాల రూపంలో వస్తున్నాయి. ముందుగా చెల్లిస్తేనే మందులు సరఫరా చేస్తామంటూ పేమెంట్‌ లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించకండి. ఇంటికి వచ్చి మందులు ఇచ్చాకే డబ్బులు తీసుకునే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. logo