బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 01:12:32

త్ర్రీ ఇన్‌ వన్ ఇన్‌హేలర్‌ థెరఫీని పరిచయం చేసిన గ్లెన్‌మార్క్

 త్ర్రీ ఇన్‌ వన్ ఇన్‌హేలర్‌ థెరఫీని పరిచయం చేసిన గ్లెన్‌మార్క్


హైదరాబాద్: ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ (గ్లెన్‌మార్క్‌) సింగిల్‌ ఇన్‌హేలర్‌ ట్రిపుల్‌ థెరఫీ ఎయిర్‌ జెడ్‌ –ఎఫ్‌ఎఫ్‌ (AIRZ-FF)ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి–సీఓపీడీ) కోసం రెండు బ్రాంకోడిలేటర్స్‌, గ్లైకోపిర్రోనియం ,  ఫార్మోటెరాల్‌ మరియు ఇన్‌హేలేషన్‌ కోర్టికోస్టెరాయిడ్‌ ఫ్లూటికాసోన్‌ ప్రోపియోనేట్‌ సమ్మేళనం ఇది. ఈ నూతన ట్రిపుల్‌ థెరఫీ ఆవిష్కరణ గణనీయమైన రీతిలో బ్రాంకోడిలేషన్‌ (శ్వాసను సులభంగా తీసుకునేలా ) చేయడంతో  పాటు ఊపిరితిత్తులపై తీవ్రమైన దాడుల ప్రమాదం తగ్గించడం, ఇన్‌హేలర్లపై ఆధారపడడాన్నితగ్గిస్తుంది.   గణనీయమైన రీతిలో ప్రజా ఆరోగ్య సవాల్‌గా సీఓపీడీ నిలుస్తుంది. చికిత్స దగ్గరకు వచ్చేసరికి రోగి సమ్మతి సరిగా లేకపోవడం, నిర్ధేశించిన డోస్‌లకు కట్టుబడి ఉండాల్సి రావటం, రోజంతా ఇన్‌హేలర్లు వాడడం వంటి సమస్యలు ఉన్నాయి.  ఎయిర్‌జెడ్‌–ఎఫ్‌ఎఫ్‌ పరిచయంతో, మూడు ప్రభావవంతమైన థెరఫీలను ఒకే ఇన్‌హేలర్‌లో అందించడం ద్వారా రోగులకు ఈ భారాన్ని మేము తగ్గించగలమని అనుకుంటున్నాం’’ అని ఇండియా ఫార్ములేషన్స్‌, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఆఫ్రికా – గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌   అధ్యక్షులు సుజేష్‌ వాసుదేవన్‌ అన్నారు. 


logo