శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 00:49:52

విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా

 విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా


అమరావతి: ఏపీలోమద్యం అమ్మకాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ పై  హైకోర్టులో తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం కొంత సమయాన్ని కోరింది. గురువారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటీషనర్ తరుపున వాదనలు న్యాయవాది బీఎస్ ఎన్వీ ప్రసాదబాబు వినిపించారు. మద్యం అమ్మకాల సమయంలో భౌతిక దూరం నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్యపాన నిషేధం పాలసీ తీసుకొచ్చినప్పుడు... అత్యవసరంగా వైన్ షాపులు తెరవాల్సిన అవసరం ఏముందని పిటీషనర్ తరపున ఆయన ప్రశ్నించాడు . అయితే దశలవారీగా మద్యపాన నిషేధం చేపడతామని ప్రభుత్వం చెప్పింది. వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని సర్కారు కోర్టుకు తెలిపింది. 


logo