బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 00:19:02

బాధ్యులను కఠినంగా శిక్షించాలి : కన్నా లక్ష్మీనారాయణ

బాధ్యులను కఠినంగా శిక్షించాలి : కన్నా లక్ష్మీనారాయణ


అమరావతి: ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  డిమాండ్ చేశారు. ఆయన సీఎం జగన్​కు ఎల్జీ పాలిమర్స్ ఘటన పై లేఖ రాశారు. ప్రమాదంలో మృతి చెందిన 12 మందిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటన భోపాల్ గ్యాస్ లీక్ విషాదాన్ని గుర్తు తెస్తున్నదని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగిందనేది వాస్తవం అని అన్నారు. కర్మాగారాన్ని తనిఖీ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని కన్నాలక్ష్మీనారాయణ వెల్లడించారు.


logo