శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 00:16:33

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు

 బెంగళూరు, న్యూఢిల్లీ మధ్య రోజూ తిరిగే రైలు, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, రాయచూరు సికింద్రాబాద్, కాజీపేటల మీదుగా ప్రయాణిస్తుంది. బెంగళూరులో రాత్రి 8 గంటలకు, న్యూఢిల్లీలో రాత్రి 8.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్ మధ్య శుక్ర, ఆదివారాల్లో, తిరుగు ప్రయాణంలో బుధ, శుక్ర వారాల్లో నడిచే రైలు, విజయవాడ, వరంగల్ నగరాల మీదుగా ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు, చెన్నై సెంట్రల్ లో ఉదయం 6.05 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. సికింద్రాబాద్, న్యూఢిల్లీ మధ్య బుధవారం, తిరుగు ప్రయాణంలో ఆదివారం బయలుదేరే రైలు కాజీపేట మీదుగా సాగుతుంది.* సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.45 గంటలకు, న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3.55 గంటలకు రైళ్లు బయలుదేరుతాయి. కాగా, ఈ రైళ్లు అన్ని ఎసి బోగీలతోనే నడవనున్నాయి.  ఈ స్పెషల్ ట్రైన్లకు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్లకొనుగోలుచేయాలి. టికెట్ కన్‌ఫాం అయిన ప్రయాణీకులు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. టికెట్ కలిగిన ప్రయాణీకులు గంట ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. తద్వారా వారికి థర్మల్ స్క్రీనింగ్, కరోనా టెస్టులు నిర్వహిస్తారు.  ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌తో పాటు బ్లూటూట్ లొకేషన్ ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచాలి.  ప్రయాణీకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.logo