గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 23:55:43

లాక్ డౌన్ పొడిగించండి

 లాక్ డౌన్ పొడిగించండి


కరోనాని కట్టడి చేయలేకపోతున్నాం. లాక్డౌన్ ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది . లేకపోతే రోడ్ల మీద ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా.. కరోనాను ఎలా అదుపు చేయాలంటూ పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీ దగ్గర వాపోయారు. మూడో విడత లాక్ డౌన్ కొనసాగుతున్నది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి వివిధ రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంలు లాక్డౌన్ పొడిగించడానికే ఓటు వేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, మహారాష్ట్రలు కూడా నెలాఖరు వరకు లాక్డౌన్ అమలు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా లాక్డౌన్-4 పై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.


logo