సోమవారం 01 జూన్ 2020
National - May 11, 2020 , 23:38:42

ఆర్టీసీ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

 ఆర్టీసీ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

అమరావతి : ఏపీలో లాక్ డౌన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచుతారనేది అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయంపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పెట్టేసినట్టు అయ్యింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు మేరకు నడుచుకుంటామని చెప్పారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బస్ లు తిప్పమని ఆదేశాలు ఇస్తే వెంటనే బస్సులు నడుపుతామని మంత్రి పేర్ని నాని వివరించారు. 


logo