మంగళవారం 26 మే 2020
National - May 11, 2020 , 23:31:38

మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం : ఏపీ సీఎం

మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం : ఏపీ సీఎం అమరావతి : ఎల్జీ గ్యాస్ బాధిత గ్రామాల్లో మంత్రులంతా ఈ రాత్రికి బసచేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. శానిటేషన్‌ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్యాస్‌లీక్‌ ప్రభావిత గ్రామాల్లో పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ పదివేల చొప్పున ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు.  రేపు ఉదయం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలని ,అన్‌ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో డబ్బు వేసేలా బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. పారదర్శకంగా, ఫిర్యాదులు లేకుండా ఆర్థిక సాయం అందించాలని జగన్ అధికారులను కోరారు.  


logo