గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 22:53:43

కాణిపాకం ఆల‌యంలోకి భ‌క్తుల‌ అనుమ‌తిపై అధికారుల కసరత్తు

 కాణిపాకం ఆల‌యంలోకి భ‌క్తుల‌ అనుమ‌తిపై అధికారుల కసరత్తు

చిత్తూరు: లాక్‌డౌన్  ప్రభావం‌తో దేశంలోని ఆల‌యాల‌న్నీ మూతపడ్డాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం , షిర్డీ, శ్రీశైలం, ఉజ్జ‌యిని వ‌ర‌కు చిన్న, పెద్ద ఆల‌యాల‌న్నీమూసివేశారు. అయితే భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తించకుండా కేవ‌లం ఆల‌య నిర్వ‌హ‌కులు, ప్ర‌ధానార్చ‌కుల ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నిత్యం పూజాది కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తున్నారు. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ మే 17తో ముగుస్తున్న నేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోఉన్న శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క క్షేత్రంలో భక్తులను తిరిగి అనుమతించే అంశంపై అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.  ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, క్యూలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, అలాగే పూజలు, ప్రసాదాలు, అన్నదానం ఇతరత్రా అంశాలపై విధి విధానాల‌ను త‌యారు చేస్తున్నారు. ప్ర‌భుత్వం భ‌క్తుల‌కు అనుమ‌తించాక‌..రోజూ ప‌రిమిత సంఖ్య‌లో ద‌ర్శ‌నాలు క‌ల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  


logo