బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 22:34:24

హోమ్ క్వారంటైన్‌లో 10 మంది డ్రైవర్లు

 హోమ్ క్వారంటైన్‌లో 10 మంది డ్రైవర్లు

రాజమండ్రి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా ఏపీలో 10 మంది డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అమలాపురంకు చెందిన ఆరుగురు ఆర్టీసీ డ్రైవర్లు, రాజమండ్రికి చెందిన నలుగురు ఆర్టీసీ డ్రైవర్లను  అధికారులు హోమ్ క్వారెంటైన్‌కు తరలించారు. కాగా శనివారం 100 మంది ఒఎన్జీసీ ఉద్యోగులను రావులపాలెం నుంచి ఇంద్ర బస్సుల్లో అధికారులు చెన్నై తీసుకెళ్లారు. అందులో ఇద్దరు ఒఎన్జీసీ ఉద్యోగులకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు 10 మంది ఆర్టీసీ డ్రైవర్లను హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు.  


logo